

యుపిఎల్ క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం చేసిన కాంగ్రెస్ నాయకులు
మనోరంజని ప్రతినిధి గంగాధర ఏప్రిల్ 04 :- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామంలో నిర్వహించిన యుపిఎల్ సీజన్ 9 క్రికెట్ టోర్నీ విజయవంతంగా ముగిసింది. ఈ టోర్నీకి గంగాధర మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దోర్నాల శ్రీనివాసరెడ్డి ప్రైజ్ మనీ స్పాన్సర్ చేశారు.ఫైనల్ మ్యాచ్‌లో మోతె మధు టీమ్ మొదటి బహుమతి, పల్లె రమేష్ టీమ్ రెండవ బహుమతి సాధించగా, వాటిని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల చేతుల మీదుగా ప్రదానం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “క్రికెట్ ఒక క్రీడే కాదు, అది యువతకు ప్యాషన్. ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువత ఐక్యతగా ఉండగలుగుతారు. గ్రామ స్థాయిలో యువత తమ ప్రతిభను చాటుతారు” అని చెప్పారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ నాయకులు రామిడి రాజిరెడ్డి, తోట కరుణాకర్, గరిగంటి కరుణాకర్, రోమాల రమేష్, బూరుగు గంగన్న, రేండ్ల రాజిరెడ్డి, రాచమల్ల భాస్కర్, ముద్దం నాగేశ్, బొల్లాడి శ్రీనివాసరెడ్డి, మోతె నరసింహారెడ్డి, ఆళ్ల విజేందర్, దొంతుల శీను తదితరులు హాజరయ్యారు.ఈ టోర్నీని జగదీష్, మధు, మహేష్, అంజి, సాయిరెడ్డిలు అద్భుతంగా నిర్వహించారు