మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి

మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 29 – త‌న ప‌రిపాల‌నా దీక్ష నైపుణ్యం.. ప్ర‌భావంత‌మైన రాజ‌కీయంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, అత్యంత శ‌క్తిమంత‌మైన నాయ‌కునిగా నిలిచారు. ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌ 2025 సంవ‌త్స‌రానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్య‌ధిక శ‌క్తిమంతులైన 100 మంది ప్ర‌ముఖుల‌తో జాబితా విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం ద‌క్కించుకున్నారు. 2024 సంవ‌త్సర‌పు జాబితాలో 39 స్థానంలో ఉన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11 స్థానాలు ఎగ‌బాకి 28వ స్థానానికి చేరుకోవ‌డం విశేషం. దేశంలో రాజ‌కీయ‌, వ్యా పార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్య‌క‌లాపాలు, దేశ‌వ్యాప్తంగా ఇండియా కూట‌మిలో పోషిస్తున్న ప్ర‌ముఖ‌మైన పాత్ర‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు ల‌భించింది. త‌నదైన దూకుడుతో భార‌త‌ రాజకీయాల్లో ఆయ‌న చూపుతున్న ప్ర‌భావం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో ఆయ‌న ర్యాంకు మెరుగుప‌డింది. ఒక ప్రాంతీయ నాయ‌కుడినే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒక‌రిగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భ‌ వించారు. ఈ జాబితాతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని ఇండియా కూట‌మిలోని ఇతర ప్ర‌ముఖులైన సీఎంల సరసన నిలిపింది. ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాధాన్యతలతో సమన్వయం చేయగలిగిన మేధో సంపత్తి, వ్యూహాత్మక దృక్పథం రేవంత్ రెడ్డిని కీల‌క నాయ‌కునిగా నిలిపేలా చేశాయి. శ‌క్తిమంతులై వంద మంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అశ్విన్ వైష్ణ‌వ్‌, బీజేపీయే త‌ర రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఎం.కె. స్టాలిన్, మమతా బెనర్జీ, సిద్ధరా మయ్య వంటి నేత‌లు తొలి 25 మందిలో ఉన్నారు.

  • Related Posts

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

    తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “హిందువుల ప్రతి పండుగ శాస్త్రీయతతో పాటు గొప్ప సందేశాన్ని కూడా కలిగి ఉంటుంది. ఉగాది మనకు సామాజిక…

    విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు

    ✒విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అన్నీ ఫ్రీఫ్రీ అంటూ ఓట్ల కోసం జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం