

మే 1 నుంచి పెరగనున్న బ్యాంకు ఛార్జీలు
ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ పై మే 1 నుంచి ఛార్జీలు పెరగనున్నాయి. ఆర్బీఐ ఇంటర్చేంజ్ ఫీజు పెంచడానికి అనుమతించడం తో ఉచిత పరిమితి మించితే లావాదేవీకి రూ.2, బ్యాలెన్స్ విచారణకు రూ.1 అదనంగా చెల్లించాలి. దీంతో ఏటీఎం నుంచి పరిమిత సంఖ్యకు మించి నగదు తీసుకున్నప్పుడు ఒక్కో లావాదేవీకి రూ.19, బ్యాలెన్స్ చెకింగ్కి రూ.7 చెల్లించాల్సి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు