మూడు కోట్ల 97 లక్షల రూపాయలతో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే….
విద్యాభివృద్ధి ద్యేయంగా ముందుకు సాగుతానని, నియోజకవర్గం విద్యారంగంలో మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం బైంసాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉషా పథకం కింద మూడు కోట్ల 97 లక్షల రూపాయలతో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసిన సందర్భంగా మాట్లాడారు. కళాశాల అభివృద్ధికి మొత్తం ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగిందని, మిగతా నిధులను కళాశాలలో కంప్యూటర్ లు, ఇతరత్రా పనుల కోసం వెచ్చిస్తామన్నారు. కళాశాల అభివృద్ధి కోసం ప్రిన్సిపల్ అధ్యాపకులు పనిచేస్తున్న తీరును ఆయన అభినందించారు. విద్యార్థులు లక్ష్యసాధన తో ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కళాశాల అధ్యాపక బృందం ఘనంగా స్వాగతించి, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కే. బుచ్చయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్ , డాక్టర్ నగేష్ తో పాటు పట్టణ మండల బిజెపి నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.