

ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు
మనోరంజని ప్రతినిధి లోకేశ్వరం మార్చి 21 :- పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం లోని పంచగూడి గ్రామంలో శుక్రవారం ముస్లిం సోదరులకు మాజీ ఉప సర్పంచ్ సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఇప్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీరు పటేల్, శంకర్ పటేల్ , ప్రవీణ్ దాదా, రవికుమార్, పీసరి పోశెట్టి, మహేష్, ఆనంద పటేల్, రాజన్న గుండ్ల సాయన్న, తిమెరిసాయారెడ్డి, సుదర్శన్ గౌడ్ కార్యక్రమంలో గ్రామస్తులు, ముస్లిం సోదరులు, పలువురు పాల్గొన్నారు.