

ముస్లిం సహోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 20 :- రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని, ముస్లిం సహోదరుల ఉపవాస దీక్షలను గౌరవిస్తూ ఎన్‌హెచ్‌ఆర్‌సి జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం సహోదరులకు ప్రత్యేక ప్రార్థనల అనంతరం విందు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సి కార్యదర్శి మహమ్మద్ గౌస్ మాలిక్ మద్దతుతో నిర్వహించారు.ఈ సందర్భంగా మాల్వేకర్ ధర్మేంద్ర మాట్లాడుతూ, సామాజిక ఐక్యతను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు చండాలియా నరేందర్, జె. లక్ష్మణ్, వెంకటేష్, మహమ్మద్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.