

ముధోల్ వారపు సంత వేలం రూ.లక్ష 82వేలు
మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 27 ;- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ వార సంత 2025-2026సంవత్సరానికి గాను గురువారం వారపు సంత వేలం పాట ను గ్రామపంచాయతీ ఈవో ఆన్వర్ ఆలీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రా మ పంచాయతీ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహించగా గ్రామానికి చెందిన లాయక్ భాయ్ రూ.లక్ష82వేల కు దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోరి పోతన్న, తాటివార్ రమేష్,అజీజ్, పతంగి కిషన్, మోహన్ యాదవ్, షమీమ్ తోపా టు గ్రామస్థులు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు