ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కన్నతల్లి

ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కన్నతల్లి

మనోరంజని ప్రతినిధి సంగారెడ్డి జిల్లా మార్చి 28 – సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది, అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని స్థానిక రాఘ‌వేంద్ర న‌గ‌ర్ కాల‌నీలో నివాసం ఉంటున్న ఓ మ‌హిళ త‌న ముగ్గురు బిడ్డ‌ల‌కు గురువారం రాత్రి పెరుగ‌న్నంలో విషం క‌లిపి తినిపించి అనంత‌రం తానూ తీసుకుంది. దీంతో ముగ్గురు పిల్ల‌లు ప్రాణాలు కోల్పోయారు. త‌ల్లిని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. నిన్న‌ రాత్రి ర‌జిత అనే మ‌హిళ‌ త‌న ముగ్గురు పిల్ల‌లు సాయికృష్ణ‌(12), మ‌ధుప్రియ‌(10), గౌత‌మ్‌ (8)ల‌కు పెరుగ‌న్నంలో విషం క‌లిపి పెట్టింది. ఆమె కూడా అదే ఆహారాన్ని తీసుకుంది. భ‌ర్త చెన్న‌య్య‌కు మాత్రం ప‌ప్పు అన్నం పెట్టింది. పెరుగు అన్నం తిన్న ముగ్గురు పిల్ల‌లు ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు పిల్ల‌ల మృత‌దే హాల‌ను పోలీసులు స్వాధీ నం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ర‌జిత ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. కాగా, కుటుంబ గొడ‌వ‌ల కార‌ణం గానే ర‌జిత ఈ అఘాయి త్యానికి ఒడిగ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  • Related Posts

    బైకుపై మృతదేహంతో నిరసన.

    బైకుపై మృతదేహంతో నిరసన. మనోరంజని స్టేట్ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటకు చెందిన దార్ల హేమ దుర్గా ప్రసన్నను (31) గంగన్నగూడెం గ్రామానికి చెందిన మోదుగ సాయి బలవంతంగా లోపర్చుకొని ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలను…

    బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు

    బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయపడిన ఘటన శనివారం ముధోల్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం బైక్ వస్తున్న ఉరేకర్ పోతన్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం