ముగిసిన వట్టెం వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు

ముగిసిన వట్టెం వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు

మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ మార్చి 17

ఈ నెల12వ తేది నుండి వారం రోజులపాటుగా వైభవంగా జరుగుతున్న వట్టెం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నాడు పలు ప్రత్యేక కార్యక్రమాలతో ముగిశాయి. మిన్నపల్లి మండల పరిధిలోని వట్టెం గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వేరే మూర్తులైన బ్రాహ్మణులు చే ప్రాతరారాదన, చతుస్తానార్చన, సేవాకాలం,హోమం, రాజభోగం,పూర్ణాహుతి అనంతరం నవకలశ స్నపన చక్రతీర్తం అత్యంత శాస్త్రోక్తంగా,వైభవంగా జరిగింది.యజ్ఞఆచార్యులు శ్రీమద్వాదుల సముద్రాల శ్రీమన్నారాయణ,శ్రీకర్, శేషశాయి,రంగనాథ్, ప్రసాద్,నరసింహాచార్యులు,నవీన్,తివారీ తదితర అర్చక బృందం ఆద్వర్యంలో స్వామివారి పుష్కరిణిలో ఉత్సవమూర్తులకు,శంఖు చక్ర నామాలకు చక్రస్నానం చేయించారు. కార్యక్రమంలో సందడి ప్రతాప్ రెడ్డి,దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ అనంత నరసింహ రెడ్డి, సందడి రాంచంద్రారెడ్డి, బండారు రాజశేఖర్, కొర్తా చంద్రా రెడ్డి,గుబ్బ సత్యం,నరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, భాస్కరాచారి, వికాసతరంగిని సభ్యులు , తదితరులు పాల్గొన్నారు. చివరగా సోమవారం రాత్రి పల్లకిసేవ,ఆచార్యులకు సన్మానంతో స్వామి వారి 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష