

మాహోర్కు పాదయాత్రగా బయలుదేరిన తండావాసులు
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని విటోలి తండాకు చెందిన శ్రీ సంత్ సేవాలాల్ దీక్షపరులు శనివారం పౌరా దేవి- మాహూర్ వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. శ్రీ సంత్ సేవాలాల్ భక్తుల-దీక్షపరులు 31 మంది శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న దీక్ష ముగింపు జరుగుతుంది. సేవలాల్ మహారాజ్ దీక్ష చేపట్టిన యువకులకు తండ పెద్దలు- ఆడపడుచులు- యువకులు సేవలాల్ మహారాజ్ దీక్షాను ప్రారంభించి బయలుదేరడం జరిగింది. 210 కిలోమీటర్ పాదయాత్ర కొనసాగుతుందని సేవాలాల్ దీక్షపరులు తెలియజేయడం జరిగింది. సంత్ సేవాలాల్ మహారాజ్ దీక్ష యువతలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని- సేవా భావాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు.