

మార్మోగిన శివానామస్మరణ
పార్డి (బి ) శ్రీ రాజరాజేశ్వర ఆలయనికి భక్తుల తాకిడి
మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 01:- నిర్మల్ జిల్లా కుబీర్ మండలం ఫార్డి (బి) గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో కొనసాగుతున్న వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం వేలాది మంది భక్తులు హాజరై గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి నూతన ధాన్యలతో చేసిన జొన్న అంబలి కుండా నెత్తిన పెట్టుకొని ఆలయం చుట్టు ఐదు ప్రదక్షాన్లు చేసి మొక్కులు తీర్చుకున్నారు.దింతో ఈ ఆలయనికి దర్శించుకునేందుకు నిర్మల్ జిల్లా తో పాటు ఇతర జిల్లాలు, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. దింతో ఆలయ ప్రగహనం శివానామస్మరణతో మారుమోగింది.శ్రీ రాజరాజేశ్వరునికి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు వి మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తూము రాజేశ్వర్ చిమ్మన్ పోశెట్టి శేరి సురేష్ బాబు బీజ్జం సంతోష్ మడి ప్రవీణ్ గణేష్ కానోబా నారాయణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు




