మార్చి 6న తెలంగాణ కేబినెట్ భేటీ
మనోరంజని ప్రతినిధి
మార్చి 6న తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ కేబినెట్ మార్చి 6న భేటీ కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం కాబోతున్న మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రంలో రెండో దఫా కులగణన నిర్వహణ, బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంపై నిర్ణయం తీసుకునున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీ, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై కేబినెట్ డెసిషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.