

మామడ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖి చేసిన జిల్లా ఎస్పీ
మనోరంజని ప్రతినిధి మామడ మార్చి 29 :- నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రమైన మామడాలోని పోలీస్ స్టేషన్ ఉదయం నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఆకస్మికంగా తనిఖీ చేయటం జరిగింది. ఆ సమయంలో హెడ్ కానిస్టేబుల్ ఒక్కరే ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జి.డి పరిశీలించి అందరి డ్యూటీలను పరిశీలించి ప్రతి రోజు జి.డి మెయింటైన్ చేయాలని సూచించారు. తగిన సిబ్బంది పోలీస్ స్టేషన్ లో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు