

మానవ జీవితానికి విజ్ఞానంతోనే మనుగడ
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 01 :- మానవ జీవితానికి విజ్ఞాన శాస్త్రంతోనే మనుగడ సాధ్యమని ప్రముఖులు అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్రా ఉన్నత పాఠశాల- సరస్వతి శిశు మందిర్- లిటిల్ ఫ్లవర్- శ్రీ అక్షర పాఠశాలల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించిన రోజును భారత ప్రభుత్వం జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించి జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మానవ జీవితంలో విజ్ఞాన శాస్త్రం పాత్రను వివరించేందుకు చార్ట్లు- నమూనాలను ప్రదర్శించారు. వివిధ రకాల విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల నమూనాలను తయారుచేసి విద్యార్థులు ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా జీవశాస్త్రం-భౌతిక శాస్త్రం- రసాయన శాస్త్రం లోని మానవునికి ఉపయోగపడే విషయాలను ప్రదర్శించి వివరించడం ఆకట్టుకుంది. విద్యార్థులను ప్రముఖులు అభినందించారు. విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు కష్టపడి నమూనాలు- చార్టలను తయారు ప్రదర్శించడం ఆకట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో రబింద్రా ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ ఆసంవార్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, చైర్మన్ భీమ్రావు దేశాయ్, శిశు మందిర్ ప్రధానాచార్యులు సారథి రాజు, లిటిల్ ఫ్లవర్ ప్రిన్సిపల్ నజీబ్ ఖాన్, కరస్పాండెంట్ దిగంబర్, శ్రీ అక్షర డైరెక్టర్ సుభాష్ పటేల్, ఉపాధ్యాయులు, ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు