

మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ నియామకం
మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 22 :- రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం ముస్తఫానగర్ గ్రామానికి చెందిన కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ ను మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 21, 2025న కరీంనగర్‌లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ప్రకటన చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన కొత్త బాధ్యతలతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్‌గా నియమితులైన కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ, పూర్తి స్థాయి కమిటీల ఏర్పాటు, కార్యాచరణ అమలుకు కృషి చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ మాట్లాడుతూ, ఉద్యమ కార్యాచరణలో కుడెల్లి ప్రవీణ్ కుమార్ చేసిన కృషిని గుర్తించి ఈ పదోన్నతి అందించామని తెలిపారు. ఉద్యమ కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన ఆకాంక్షించారు.

