

మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ
మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 10 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తరోడ గ్రామ మాజీ సర్పంచ్ సాయ్ గౌడ్ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబాన్ని సోమవారం సాయంత్రం ముధోల్ నియోజక వర్గ బిజెపి నాయకులు- పారిశ్రామికవేత్త- మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ పరామర్శించారు. మృతి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈయన వెంట మాజీ ఎంపీపీ సుభాష్ జాదవ్, నాయకులు రవి కిరణ్ గౌడ్, శేఖర్, హనుమాన్లు, మొనాజీ, రాములు, పోశట్టి, తదితరులు ఉన్నారు