

మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 27 :-పెండింగ్ బిల్లులు అందని సర్పంచ్‌లు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా ముధోల్ మండలంలోని ఆయా గ్రామాల మాజీ సర్పంచ్ లను గురువారం పోలీసులు ముందుస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచ్ల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీల్లో వీధి దీపా ల నిర్వహణ, అంతర్గత మురుగుదొ డ్లు, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, వై కుంఠ ధామం, మన ఊరు- మన బడి, పల్లె ప్రగతి, జీపీ భవన నిర్మాణాలు వంటి అభివృద్ధి పనులకు సొంత నిధు లు వెచ్చించి నిర్మాణం చే పట్టడం జరి గిందన్నారు. అసెంబ్లీ సమావేశంలో పెండింగ్ లో ఉన్న సర్పంచ్ల బిల్లులపై ఆమోద ముద్ర వేసి బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అరెస్ట్ అయిన వారిలో మాజీ సర్పం చ్లు సుకన్య రమేష్ వెంకటాపూర్ రాజేందర్, రామ్ రెడ్డి, రాంచందర్, మైసాజి, ఎర్రం మురళీ, గౌతమ్ తో తదితరులున్నారు.