

మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి
మనోరంజని ప్రతినిధి నల్గొండ జిల్లా మార్చి 06 :- కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంగోత్ మోహన్ నాయక్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లంబాడి సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు స్వరాష్ట్రం కోసం అహర్నిశలు కృషిచేసి తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవీ బాధ్యతలు ఇచ్చి వారి గౌరవానికి తోడ్పడాలని తెలిపారు గురువారం నిర్వహించిన విలేకరులు సమావేశంలో ఆయనే తెలిపారు లంబాడి సామాజిక వర్గంలో ఆయనను మించిన నాయకుడు మరొకరు లేరని ఆయన తెలంగాణ ఉద్యమం కోసం కృషి చేశారని అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేశారని గతంలోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్షిరామ్ తో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు ఎప్పుడు ఉద్యమాల్లో ఉండే వ్యక్తికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉంటే మా గిరిజనుల బతుకులు కూడా మారవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు రాములు నాయక్ మూడు సంవత్సరాల ఎమ్మెల్సీ పదవీకాలం ఉండంగానే పదవిని సైతం త్యాగం చేసి బిఆర్ఎస్ పార్టీలో కుటుంబ పాలనకు , వ్యతిరేకంగా పోరాటం చేసి పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరినారు అలాంటి డైనమిక్ లీడర్ అలాంటి ధైర్యవంతుడు గిరిజనులకు ఎంతైనా అవసరం అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా అవసరమని భావిస్తూ ఇలాంటి వారికి పదవిని ఇచ్చి సత్కరించాలని ప్రభుత్వానికి లంబాడీల,బంజారాల తరఫున యువకులు మేధావులు మహిళలు అందరి తరపున ప్రత్యేకంగా కోరుకుంటున్నారు