

మహిళా సాధికారత మన అందరి బాధ్యత
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 08 :- మహిళల హక్కులను గౌరవించడంతో పాటు, వారు సాధికారత సాధించేలా చూడడం మనందరి బాధ్యత అని వశిష్ఠ విద్యా సంస్థల అధ్యక్షుడు వి. సత్యనారాయణ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని వశిష్ఠ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ శ్రేయస్సు కోసం కూడా పాటు పడుతున్నారని కొనియాడారు. విద్యార్థినులు ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహిళాభివృద్ధి పథకాలను ఉపయోగించు కోవాలని చెప్పారు. ఆత్మ విశ్వాసంతో, ధైర్యంగా ముందడుగు వెయ్యాలన్నారు. అనంతరం కళాశాలలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకులను శాలువా, బొకె లతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అఖిలేష్ కుమార్ సింగ్, వైస్ ప్రిన్సిపల్ శశిధర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు