

మహిళా కాంగ్రెస్ నేత దారుణ హత్య
మనోరంజని ప్రతినిధి మార్చి ౦2 హర్యానాలో దారుణం జరిగింది. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. రాహుల్‌గాంధీ జోడో యాత్రలో ఆమె కీలక పాత్ర పోషించారు. దుండగులు హిమానీ గొంతు నులిమి చంపి ఆపై సూట్‌కేసులో పడేశారు. రోహ్‌తక్ జిల్లా సప్లా బస్టాండ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆమె మృతదేహం లభ్యమైంది. హిమానీ హత్యపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది