మహిళా అఘాయిత్యాలకు లోనుకాకుండా స్వయంశక్తి సాధించాలి.

మహిళా అఘాయిత్యాలకు లోనుకాకుండా స్వయంశక్తి సాధించాలి.

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 07 :- ప్రతి మహిళా అఘాయిత్యాలకు లోనుకాకుండా స్వయంశక్తి సాధించాలని, హింసకు గురైనప్పుడు గృహహింస చట్టం ద్వారా మహిళలకు కావాల్సిన రక్షణ, మనోవృత్తి పొందవచ్చునని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ పద్మావతి అన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పురోగతి వైపు బాటలు వేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్సపల్లి లోని కురుమ సంఘం భవన్‌ లో మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పద్మావతి గారు మాట్లాడుతూ మహిళలు పిండ దశ నుంచే దాడులు ఎదుర్కొంటున్నారని, మహిళలపై అఘాయిత్యాలు అరికట్టాలంటే ప్రతి మహిళా విధ్యావంతురాలై ఉండాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగివుండాలని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని, తమ హక్కులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.మహిళలకు సంబంధించిన చట్టాల గురించి (పోక్సో యాక్ట్‌, భరణం, విడాకులు, గృహహింస చట్టం, వరకట్నం)కు సంబంధించిన పలు చట్టాలపై విద్యార్థినులకు వివరించారు. స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమాన హక్కు ఉందని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన మహిళా ఉద్యోగులకు సత్కారం చేశారు. ఎన్నో త్యాగాలతో, ఎన్నో పోరాటాలతో మహిళలు సాధించుకున్న అనేక హక్కులపై నేడు ప్రపంచ వ్యాప్తంగా దాడి జరుగుతోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ లు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ దాడులను తిప్పికొట్టేందుకు మహిళా దినోత్సవ స్ఫూర్తితో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో మహిళల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యలో పడినట్టైందన్నారు. దాడులు, అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. వీటిని అరికట్టడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా పటిష్టంగా అమలు కావడం లేదని చెప్పారు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే మనముందున్న ఏకైక మార్గమన్నారు. ఆ దిశగా మహిళల్లో చైతన్యం, విజ్ఞానం పెంపొందించే దిశగా కృషి చేయాలన్నారు. ఐద్వా జిల్లా సుజాత అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్ రాములు, అర్వపల్లి 15 వ డివిజన్ కార్పొరేటర్ ముంచుకురు లావణ్య నవీన్, విడిసి అధ్యక్షులు తూట్కూర్ నర్సయ్య, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి శిర్ప లింగం, డాక్టర్ షాబుద్దీన్, మహిళలు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు శివశంకర భవాని ప్రసాద్ కు పురోహిత వైభవ ప్రవీణ బిరుదు ప్రధానం మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్…

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి.. ఏప్రిల్ ఎండలు మండు అని చదివే ఉంటారు. కానీ, మార్చి నెల మొదలైన నాటినుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. బయట తిరగాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం పూట ఎండలు భగభగ మంటున్నాయి.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .