

మహిళలపై అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు:పవన్
మనోరంజని ప్రతినిధి మార్చి 08 _ AP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణానికి నిజమైన వాస్తు శిల్పి.. స్త్రీ మూర్తి అని పేర్కొన్నారు. సోషల్ మీడియాల ద్వారా, వివిధ రూపాల్లో మహిళల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడే ప్రతి ఒక్కరిపైనా కఠినంగా వ్యవహరిస్తాం. మహిళల రక్షణ, సంక్షేమం మా ప్రభుత్వ బాధ్యత అని పవన్ వ్యాఖ్యానించారు.