మహిళను దారుణంగా కొట్టి.. కారులో ఎక్కించుకుని పోయి.. బాబోయ్..

మహిళను దారుణంగా కొట్టి.. కారులో ఎక్కించుకుని పోయి.. బాబోయ్..

ఖమ్మం: జిల్లాలో మహిళ కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. పెనుబల్లి మండలం గౌరారం టోల్ ప్లాజా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను అపహరించారు. ఇద్దరు వ్యక్తులు మహిళపై దాడి చేసి బలవంతంగా కారులో ఎక్కించుకుని పరారయ్యారు. మార్చి 21న ఉదయం 11 గంటల సమయంలో జరిగిన కిడ్నాప్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టోల్‌ ప్లాజా వద్ద సీసీ కెమెరాలో కిడ్నాప్ దృశ్యాలు రికార్డయ్యాయి.
అయితే ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అపహరణకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో అవి ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. అయితే నిందితులు ఎవరు, మహిళను ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఆమె ప్రాణాలతోనే ఉందా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు తక్షణమే కిడ్నాపర్లను పట్టుకుని మహిళను రక్షించాలని కోరుతున్నారు. మరోవైపు మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగిపోతున్నాయంటూ ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు.

  • Related Posts

    ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై..

    మనోరంజని ప్రతినిధి మార్చి 25 – రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్.. రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్.. కాకినాడ జిల్లా: పిఠాపురం.

    SLBC టన్నెల్లో మరో మృతదేహం లభ్యం

    బ్రేకింగ్ న్యూస్ SLBC టన్నెల్లో మరో మృతదేహం లభ్యం కన్వేర్ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో లభించిన మరో మృతదేహం మినీ హిటాచితో మట్టి తవ్వుతుండగా కనిపించిన మృతదేహం మృతదేహాన్ని వెలికితీస్తున్న రెస్క్యూ బృందం మృతదేహాన్ని గుర్తించడానికి సమయం పట్టే అవకాశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?