మళ్లీ తెరపైకి ఈ ఫార్ములా కార్ రేస్

మళ్లీ తెరపైకి ఈ ఫార్ములా కార్ రేస్

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 15 – హైదరాబాదులో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది,ఈ అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌ లోపే తనకు నోటీసులిచ్చేందుకు ఏసీబీ సిద్దమవుతోందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది,ఈసారి విచారణతో పాటు కేటీఆర్ అరెస్ట్ కూడా ఉంటుందన్న ప్రచారం బీఆర్ఎస్ వర్గాల ను ఆందోళనకు గురిచేస్తోం దట. గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్దమవుతున్న వేళ..ఈ కార్ రేస్ కేసు ఏ మలుపు తీసుకుంటుందో నన్న ఉత్కంఠ కొనసాగు తోంది.ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిం దని, నిబంధనలకు విరు ద్దంగా కోట్ల రూపాయలను విదేశాలకు తరలించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపి స్తోంది. దీంతో గత బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిటెండ్ కేటీఆర్‌తో పాటు పలువురు అధికారులపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని కేటీఆర్ పిటీషన్‌పై వేయ గా..విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఏసీబీ విచారణకు హారయ్యారు కేటీఆర్. ఇదే సమయంలో ఈడీ కూడా ఈ కార్ రేసుపై కేసు నమోదు చేయగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు కూడా హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు కేటీఆర్. ఆ తర్వాత వ్యవహారం అంతా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి తనకు ఏసీబీ, ఈడీ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోపే తనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారని కేటీఆర్ భావిస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఏమీ ఉండదని, అందుకే ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు మరోసారి ఈ కార్ రేస్ కేసును తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగు తోందని కేటీఆర్ చెబుతు న్నారట. అంతేకాదు తనను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన అంటున్నారట. ఇలా కేటీఆరే ఇప్పుడు ఈ కార్ రేస్ అంశాన్ని లేవనె త్తి..తనకు మళ్లీ నోటీసులు ఇస్తారని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుం దన్న చర్చ జరుగుతోంది. రేపటి నుంచి ఈనెల 27 మధ్యలో ఎప్పుడైనా తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుందని కేటీఆర్ డేట్స్‌తో సహా చెప్ప డంతో అరెస్ట్‌పై ఆయనకు పక్కా సమాచారం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఫార్ములా ఈ కారు రేస్ కేసు దర్యాప్తు ఫైనల్‌ స్టేజ్‌కు చేరుకుందట. అందుకే తనకు ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వబోతున్నట్లు కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి కేవలం నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంతో సరిపెట్టకుండా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ అనుమా నించడం బీఆర్ఎస్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోందట

  • Related Posts

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్ TG: బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి గత ఏడాది రాష్ట్రంలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొదట లాభాలను ఎరవేసే మోసగాళ్లు ఆపై నిండా ముంచుతున్నారు. దీనికి సోషల్ మీడియా…

    సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

    సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన మినుగు రాహుల్(18)కు.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రచింతల్ గ్రామానికి చెందిన గోలేటి శ్వేత(20)కు మధ్య సామాజిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్