

మల్లారెడ్డి విశ్వవిద్యాపీట్ ఏకత్వ 2025 వార్షికోత్సవ వేడుకలు
మనోరంజని, తెలంగాణ చీఫ్ బ్యూరో: వార్షికోత్సవ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ , మల్లారెడ్డి కళాశాలల అధినేత, ఎమ్మెల్యే మల్లారెడ్డి, అర్జున్ రెడ్డి ఫేమ్, సినీ హీరో విజయ్ దేవరకొండ. సూరారంలోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీట్ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఏకత్వ 2025” వార్షికోత్సవ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ , మల్లారెడ్డి కళాశాలల అధినేత, ఎమ్మెల్యే మల్లారెడ్డి , అర్జున్ రెడ్డి ఫేమ్, సినీ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సంధర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను , యువతను ఎంతగానో అలరించాయి. అనంతరం బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ తో పాటుగా ఇతర ముఖ్య అతిథులు మాట్లాడుతూ. పట్టుదల, స్వయంకృషితో ఎదిగిన మల్లారెడ్డి నేటి యువతరానికి ఎంతో ఆదర్శమని, విద్యార్థులు విద్యతోపాటు ఇతర రంగాలలో రాణించేలా వారిని ప్రోత్సహిస్తున్న మల్లారెడ్డి విశ్వ విద్యాపీట్ సంస్థకు మా అభినందనలు. విద్యార్థులు కష్టపడి చదివి కన్న తల్లిదండ్రులకు, పుట్టిన ప్రాంతానికి మంచి పేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి, సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
