మలేషియా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖానాపూర్ నియోజకవర్గ వాసుల విడుదలకు తీవ్రంగా కృషి చేస్తున్న భూక్యా జాన్సన్ నాయక్

ఆపదలో ఆపద్బాంధవుడు..
*మలేషియా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖానాపూర్ నియోజకవర్గ వాసుల విడుదలకు తీవ్రంగా కృషి చేస్తున్న భూక్యా జాన్సన్ నాయక్

మనోరంజని ప్రతినిధి మార్చి 06

ఉపాధి నిమిత్తం గత సంవత్సరం కడెం మండలం లింగాపూర్ మరియు దస్తురాబాద్ మూన్యాల్ గ్రామాలకు చెందిన ఆరుగురు మలేషియా కు వెళ్లారు అనంతరం అక్కడ అకారణంగా జైల్లో ఉన్నారని కుటుంబసభ్యులకు సమాచారం అందగా కుటుంబసభ్యులు *బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ను వారి వివరాలు తెలుపగా ఎలాగైనా జైలులో ఉన్నవారిని విడుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చి వారి కోసం మలేషియా వెళ్ళి *బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి* సహాయంతో మలేషియా ఉన్నతాధికారులను సంప్రదించి వారు అక్రమ ఆయుధ చట్టం (The Malaysia Arms Act.) కింద జైలులో ఉన్నారని తెలుసుకొని మలేషియాలోని జైల్లో ఉన్న కడెం మండలం లింగాపూర్ వసూలు 1.రాచకొండ నరేష్. 2.తలారి భాస్కర్. 3.గురుజాల శంకర్. 4.గురిజాల రాజేశ్వర్..5.గుండా శ్రీనివాస్. మరియు మూన్యల్ గ్రామం. దస్తూరబాద్ మండలం 6.యమునూరి రవీందర్.లు జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీరందరినీ భూక్యా జాన్సన్ నాయక్ ములాఖాత్ అయి వారిని పరామర్శించి ఓదార్చి వారి విడుదల కోరకు కృషి చేస్తానని వారికి భరోసా కల్పించారు. అనంతరం అధికారులతో మాట్లాడి ఉపాధి నిమిత్తం వీరు మలేషియా వచ్చారని ఎలాంటి నేరం చేయాలేదని అకారణంగా వీరు జైల్లో మగ్గుతున్నారని భారతదేశంలో వీరి కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉందని ఉపాధి కోసం మలేషియా వచ్చి ఇక్కడ జైల్లో మగ్గుతున్నారని తక్షణమే వీరి విడుదలకు తమవంతు సహాయ సహకారాలను అందించాలని అధికారులను కోరారు. అనంతరం జాన్సన్ నాయక్ సొంత నిధులతో విరి విడుదల కోరకు ప్రత్యేకంగా అక్కడి స్థానిక న్యాయవాదులను నియమించి త్వరగా వీరు మలేషియా జైలు నుంచి విడుదలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని.. జైల్లో ఉన్న ఆరుగురు విడుదలై ఇంటికి తిరిగి వచ్చే వరకు తన శాయశక్తుల కృషి చేస్తానని జాన్సన్ నాయక్ అన్నారు.

  • Related Posts

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు ఖగోళ ప్రియులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈ నెల 13-14తేదీల మధ్య సంభవించనున్నది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కావడం విశేషం. అయితే ఈ గ్రహణం మాత్రం భారత్లో కనిపించే అవకాశం లేదు.…

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    మనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 13 :గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ను నివారించడానికి చైనా వ్యాక్సిన్ను రూపొందించింది. రక్తనాళాలు గట్టిపడడం, రక్తవాహికల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడానికి కారణమయ్యే ‘ప్లేక్స్’ ఏర్పడడాన్ని ఈ నానో వ్యాక్సిన్ నిరోధిస్తుంది. నాన్జింగ్ యూనివర్సిటీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్