

మలక్ చించోలిలో ఉచిత వైద్య శిబిరం

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 07 :- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మలక్ చించోలి గ్రామంలో శ్రీ వందన హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎండి ఫిజీషియన్ డాక్టర్ దుర్గాప్రసాద్, వల్లకొండా సురేష్ గౌడ్, సతీష్ కుమార్, మైస శేఖర్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కాల్వ నరేష్, అంబటి గంగాధర్, అయిటి కార్తీక్, గుండా రమేష్, తదితరులు పాల్గొన్నారు.