

మరో కేసులో విజయవాడ స్టేషన్ కు పోసాని కృష్ణ మురళి
మనోరంజని ప్రతినిధి అమరావతి మార్చి 08 – పోసాని కృష్ణ మురళి పై కూటమి సర్కార్ వేధింపులు ఆగడం లేదు కూటమి పార్టీల నేతలు పెట్టిన కేసుల్లో ఆయనకు వరుసగా ఊరటలు దక్కుతుండడం తెలిసిందే, ఈ క్రమంలోనే ఆయనను ఇంకో కేసుల్లో ఇప్పుడు మరో పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.అయితే శుక్రవారం పోసాని కృష్ణమురళికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మరో కేసులో కర్నూలు నుంచి విజయ వాడకు పోసానిని పోలీసు లుఈరోజు తరలిస్తున్నారు. పోసానిపై వివిధ సెక్షన్ల కింద ఓబులవారిపల్లె పోలీసుల్లు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయగా.. అతనికి బెయిల్ ఇవ్వకూడదని పోలీసు తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే.. కడప మొబైల్ కోర్టు పోసాని తరుపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ.. బెయిల్ మంజూరు చేసింది.ఈ నేపథ్యంలో మరో కేసు నిమిత్తం పోసానిని కర్నూ లు నుంచి విజయవాడకు తరలిస్తున్నారని తెలు స్తోంది. ఇందులో భాగం గా… విజయవాడలోని భవానీపురం పీఎస్ లో పోసానిపై కేసు నమోదైంది. దీంతో… పీటీ వారెంట్ పై ఆయనను అక్కడకు తీసుకువెళ్లేందుకు విజయ వాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతిం చింది.వాస్తవానికి.. శుక్రవారం అర్థరాత్రి నరసరావుపేట పోలీసుల కస్టడీ పిటిషన్ ను కోర్టు రద్దు చేసింది. దీంతో.. విజయవాడ భవానీపురం పోలీసులు కర్నూలు జైలుకు చేరుకున్నారు. అనంతరం.. ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ (పీటీ వారెంట్) కింద పోసానిని హైదరాబాద్ మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు!