

మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!
ఇవాల్టి నుంచి మరో 5 రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరగొచ్చని అంచనా వేసింది. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41-44 డిగ్రీల మధ్య, మరికొన్ని జిల్లాల్లో 36-40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది..