మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 11 :- మద్యం సేవించి వాహనాలను నడిపినట్లయితే చర్యలు తప్పవని ముధోల్ ఎస్ఐ సంజీవ్ అన్నారు. ముధోల్ మండలంలోని తరోడా -చించాల గ్రామాల మధ్య ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ను ధరించాలన్నారు. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు పరిమితి కి మించి ప్రయాణికులను తీసు కెళ్లరాదని సూచించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను పాటించి పోలీసులకు సహకరిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ శ్రావణి, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు