

మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ముస్లిం ప్రజలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు విందుకు హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,ఆర్డిఓ సరత
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 28 : మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ పేర్కొన్నారు.శుక్రవారం సాయంత్రం నియోజకవర్గ ముస్లిం ప్రజల కోసం ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. షాద్ నగర్ ఆర్డిఓ సరిత నేతృత్వంలో జరిగిన ఇఫ్తార్ విందుకు ఆరు మండలాల ఎమ్మార్వోలు, సిబ్బంది ఏర్పాట్లను సమీక్షించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శంకర్ తో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్, మైనార్టీ నేత మహమ్మద్ ఇబ్రహీం,
జమ్రుద్ ఖాన్, అసద ముక్తార్ అలీ, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, చెన్నయ్య బసవ, అందే మోహన్ సర్వర్ పాషా, అల్తాఫ్ హుస్సేన్, సయ్యద్ ముక్తదీర్ అలీ, సయ్యద్ మనన్ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీడ్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు దోహదపడుతాయని ఎమ్మెల్యే తెలిపారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు అధికారికంగా ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం, మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు..

