

మంథని: ఇందిరమ్మ ఇండ్ల పురోగతి నమోదు చేయాలి: కలెక్టర్
మనోరంజని ప్రతినిధి మార్చి 20 – ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని యాప్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం మంథని మండలం అడవి సోమన్ పల్లి గ్రామంలో నిర్మాణమవుతున్న ఇందిరమ్మ ఇళ్లను తనిఖీ చేశారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఆర్డీఓ సురేష్, ఇన్‌చార్జి తహశీల్దార్ గిరి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాజశేఖర్ ఉన్నారు