మంత్రి (ఉప ముఖ్యమంత్రి) పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ కదనాలపై సి బి ఐ ధర్యాప్తుకు ఆదేశించాలి ..

మంత్రి (ఉప ముఖ్యమంత్రి) పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ కదనాలపై సి బి ఐ ధర్యాప్తుకు ఆదేశించాలి ..

తెలంగాణా – ఆంధ్రప్రదేశ్ ల నుండి దమ్మున్న నేతలను పార్లమెంట్ , అసెంబ్లీ లకు పంపుదాం .

తెలంగాణాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనర్హులు ..

ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ లో మోడీని ప్రశ్నించల లేని భలహీనులు ప్రాతినిత్యం వహిస్తున్నారు ..


మేడా శ్రీనివాస్ , రాజకీయ విశ్లేషణ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్..

మనోరంజని ప్రతినిధి రాజమండ్రి మార్చి ౦2 తెలుగు రాష్ట్రాలపై విషం చిమ్ముతున్న మోడీ సర్కార్ కు బుద్ది చెపుదాం ఏకం కండి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు.. ఆంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రిగా ప్రచారంలో వున్నటు వంటి కొణిదల పవన్ కళ్యాణ్ కు సంబందించి తన వ్యక్తిగతానికి సంబంధించి రెండు పెన్ డ్రైవ్ లు కిరణ్ రాయల్ అనే జనసేన పార్టి వ్యక్తి వద్ద వున్నాయంటు లక్ష్మి అనే ఒక మహిళ చేసిన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దిగజార్చే విధంగా వుందని , పవన్ కళ్యాణ్ రాజకీయ భలహీనతలకు తలోగుతున్నారనే పొంతన లేని మాటలను గమనిస్తున్న ఆంధ్రులుకు ఆ మహిళ చేసిన ఆరోపణలపై నిగ్గు తెల్చాల్సిన అవసరం వుంది . పవన్ కళ్యాణ్ పై వచ్చిన పెన్ డ్రైవ్ ల ఆరోపణలు రాష్ట్ర ప్రతిష్టను ఎంతగానో ఆపకీర్తికి కారణంగా మారాయని, ఆంధ్రప్రదేశ్ వంటి మహోన్నత రాష్ట్రానికి మంత్రి (ఉప ముఖ్యమంత్రి) గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పై ఆరోపింప బడుతున్న పెన్ డ్రైవ్ ల వ్యవహారం మన యువత యుక్త వయస్సు భవిష్యత్ పై ప్రభావం చూపుతుంది . ప్రశ్నిస్తాను అంటు వచ్చిన పవన్ కళ్యాణ్ వంటి నేత ప్రస్తుత తీరుతో కొన్నాళ్ళు సన్నిహితంగా నడిచిన అఖిల పక్ష పార్టీల సన్నిహితులు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఊసరవెల్లి రాజకీయాలకు బానిసగా మారిపోవటానికి పెన్ డ్రైవ్ ల కారణమనే అనుకోలా ! పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించాలి . లేకుంటే ఆంధ్రప్రదేశ్ పాలన కుంటుపడి విష రాజకీయ కాలుష్యంతో కాలయాపన రాజకీయాలతో కాలక్షేపం జరుగుతుందని , తద్వారా అభివృద్ధి బ్రష్టు పట్టి పోతుందని , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు సన్నిహితుగా ఉంటు తన రాజకీయ ఉనికిని చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ పై వస్తున్న పెన్ డ్రైవ్ ల ఆరోపణలపై నిగ్గు తేల్చల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని , పవన్ కళ్యాణ్ పై వస్తున్న పెన్ డ్రైవ్ ల పెను వివాదంపై
సి బి ఐ ధర్యాప్తుకు ఆదేశించి పవన్ కళ్యాణ్ కు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని ఆయన కోరారు . ఆంధ్రప్రదేశ్ – తెలంగాణా రాష్ట్రాలకు చట్ట బద్దంగా రావాల్సిన నిధులు విడుదల చేయటంలో తెలుగు రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో మోడీ సర్కార్ తీవ్రమైన అన్యాయం చేస్తుందని , మోడీని ప్రశ్నించటంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దైర్యం లేకపోయిందని , ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుండి దమ్మున్న లోకసభ , శాసనసభ సభ్యులు లేకపోయారని , మోడీ పేరుచెబితే మన తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులకు ప్యాంట్స్ తడిచిపోతున్నాయని ఆయన చమత్కరించారు . ప్రధాని మోడీ మూడు పర్యాయాల కాలంలో మన తెలుగు రాష్ట్రాల నుండి మా నియోజకవర్గాలకు కావాల్సిన అభివృద్ధికి అవసరమయ్యే నిధులు కోసం ప్రశ్నించిన ఏ ఒక్క పార్లమెంట్ , శాసనసభ సభ్యుడైనా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారా ! దమ్మున్న నేతలను రెండు తెలుగు రాష్ట్రాల నుండి అసెంబ్లీ , పార్లమెంట్ సభలకు పంపుదాం . తెలుగు రాష్ట్రాల ప్రతిష్టను కాపాడుకుంద్దాం . తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం మోడీ సర్కార్ కు ఎదురు నిలిచే దమ్మున్న నేతలను చట్ట సభలకు పంపుదాం అని ఆయన పిలుపునిచ్చారు . తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ మార్కు రాజకీయానికి భిన్నంగా రేవంత్ రెడ్డి పేద వర్గాలపై విరుచుకు పడుతున్నారని , మోడీ అధికారాన్ని కార్పొరేట్ శక్తులకోసం వెచ్చిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణాలో తన సొంత ఖాజానాని నింపుకుంటున్నారని, హైడ్రా ముసుగులో పేదల నివాసాలను కూల్చివేసి సంపన్నులకు గులాంగిరి చేసిన ఘనత రేవంత్ రెడ్డీకే దక్కుతుంది . ఉద్యమ త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణా పౌరులను వేధింపులతో రేవంత్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిత్యం వహిస్తున్న కూటమి సర్కార్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించలేని నిశ్శత్తువతో అసమర్ధతను చాటుకుంటున్నారు . తెలుగు రాష్ట్రాలపై విషం చిమ్ముతున్న మోడీ సర్కార్ పై రెండు తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా ఏక కార్యాచరణకు సిద్దపడాలని , తెలంగాణా రేవంత్ రెడ్డి సర్కార్ కు , ఆంధ్ర రాష్ట్రంలో కూటమి సర్కార్ కు ప్రత్యామ్నాయ ఉద్యమ రాజకీయ నిర్మాణ దిశగా బలపడాలని , మోడీ పాలన తెలుగు రాష్ట్రాలకు అత్యంత ప్రమాదం అని గుర్తించాలి . బలహీనతలతో పాలనను మోడీ రాజకీయ ఆవసరాలకు తాకట్టు పెడుతున్న తెలుగు రాష్ట్రాల పాలకులను ఇంటికి సగనంపాలని , పవన్ కళ్యాణ్ పై వస్తున్న పెన్ డ్రైవ్ ల ఆరోపణలపై సి బి ఐ దర్యాప్తుకు ఆదేశించి రూమర్లకు స్వస్తి చెప్పే విధంగా పవన్ కళ్యాణ్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు . సభకు అర్పిసిసీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు .. ఈ సమావేశంలో అర్పిసి సెక్యూలర్స్ సర్వశ్రీ డి వి రమణమూర్తి , సిమ్మా దుర్గారావు , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , ఎం డి హుస్సేన్ , దుడ్డే త్రినాద్ , దోషి నిషాంత్ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బస సోనియా , శీరపు నాగేశ్వరి , నాగురి అన్నపూర్ణ, మాసా లక్ష్మి, సుంకర వెంకట భాస్కర రంగారావు , చల్లా సాంబశివరావు , తదితరులు పాల్గొనియున్నారు ..

  • Related Posts

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్, మార్చి13 :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌…

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 13 :- అసెంబ్లీ సమావేశాల్లో అభివృద్ధిపై చర్చిస్తున్న సమయం లో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ పై చేసిన వాఖ్యలకు నిరసన గా కడెం కాంగ్రెస్ పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్