మంచిర్యాల: యువతి ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఆర్కే6 కొత్త రోడ్ ఏరియాలోని లక్ష్మీనగర్ కు చెందిన మెరుగు సౌమ్య సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.