

భోసి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం.
మనోరంజని ప్రతినిధి..భైంసా ఫిబ్రవరి 28 – జాతీయ విజ్ఞాన (సైన్స్) దినోత్సవం సందర్భంగా జిల్లాలో పలు పాఠశాల లలో శుక్రవారం విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు సైన్స్ ఆవిష్కరణలు, ప్రయోగాలను ప్రదర్శించారు.భోసి ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవ సందర్భంగా సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.జాతీయ విజ్ఞాన దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు తమ యొక్క సృజనాత్మకతను ఉపయోగించి తల్లిదండ్రులు,ఉపాధ్యాయులా సహకారంతో చాలా రకాల ఆవిష్కరణలు(మోడల్స్) ను తమ కు అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించి నిత్యజీవితంలో మనము చూస్తున్న, వింటున్న విషయాలను ఆహుతులను అలరించే విధంగా చక్కగా రూపొందించారు.దైనందిన జీవితంలో ఉపయోగ పడేలా సైంట్‌ఫిక్ రీసెర్చ్‌ను ప్రోత్సహించడానికి విద్యార్థినులు చేసిన ప్రయోగాలు వర్కింగ్ మోడల్స్ లు ఆకట్టుకున్నాయి. పాఠశాల విద్యార్థులు 50 ప్రయోగాలను తయారుచేసి ప్రదర్శించారు. ద్విచక్ర వాహనాలపై స్త్రీలకు రక్షణ కల్పించే ఫ్రేమ్, సంపూర్ణాంతర పరావర్తనం, కాంతి వక్రీభవనం, కొమటోగ్రఫీ, యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారడం, మొక్కలలో వ్యాపన ప్రక్రియ, పిల్లల ఏటీఎం, పిన్ హోల్ కెమెరా, న్యూటన్ మూడోగమన నియమం, మంటలు మండడానికి ఆక్సిజన్ అవసరం, జె సి బి పనిచేసే విధానం, ఊపిరితిత్తులు/ మూత్రపిండాలు/జీర్ణ క్రియ వ్యవస్థ పని చేయు విధానాలను ఇలా భౌతిక రసాయన జీవశాస్త్రలలోని విషయలపై ప్రయోగాలు, ప్రదర్శనలు నిర్వహించారు. ప్రయోగాలు తిలకంచడానికి వచ్చిన ఉపాధ్యాయులకు, తోటి విద్యార్థులకు తాము తయారుచేసిన ప్రయోగాల గురించి విశ్లేషిస్తూ వివరణ ఇచ్చారు. ప్రదర్శనలలో బెస్ట్ వర్కింగ్, మోడల్స్, ప్రాజెక్ట్స్ , ప్రదర్శన ఎన్నుకోవడం కొరకు ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు సంజయ్ రావు, రవి లు న్యాయ నిర్ణీతలుగా నిర్వహించారు. ప్రదర్శించిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన బహుమతుల కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి.రాజశేఖర్ మాట్లాడుతూ సమాజానికి మేలు చేసి వస్తువులను విషయాలను కనుగొనందుకు తమ జీవితాలను ధారపోసిన శాస్త్రవేత్తలను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు వందన మాట్లాడుతూ సివి రామన్ గా పేరుగాంచిన భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరమణ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొనడంతో ఆ రోజున సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు.ఈ ప్రదర్శన విద్యార్థులకు సృజనాత్మకతకు దర్పణమని,సమాజంలో మూఢ విశ్వాసాలను పోగొట్టి, శాస్త్రీయ ఆలోచనలు కల్పించేందుకు సైన్స్ దోహదపడుతుందని, ఇంచార్జ్ ఉపాధ్యాయులు సంజీవరావు ఇతర ఉపాధ్యాయులు అన్నారు. చివరగా ప్రయోగ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులందరికీ మొదటి రెండవ బహుమతులతో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు వందన విద్యార్థులందరికీ సైన్స్ దినోత్సవం సందర్భంగా తన సొంత ఖర్చుతో మిఠాయిలన పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు జి.రాజశేఖర్,నీలా, సృజన లు.భౌతిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు సుధాకర్ వందన, ఇతర విషయాలు బోధించే ఉపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్, ద్రుపత్ రెడ్డి, రామచందర్,శ్రీదేవి ,సంగీత, నవీన్,రవి ,(పిడి)శ్రీధర్ రెడ్డి, శంకర్, లు పాల్గొన్నారు


