

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 14 :- , భైంసా పట్టణంలో హోళీ పండుగ సంబరాలను కన్నులపండువగా జరుపుకున్నారు. కాముని దహనం వేడుకలు తర్వాతి రోజు హోళీ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. హోళీ పండుగ పురస్కరించుకుని గల్లీ గల్లీలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుని విశ్వహిందూ పరిషత్ హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హోళీ పండుగ సంబరాలు జరుపుకుని పట్టణ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు
