

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- మానవతా దృక్పథంతో ముందుకు సాగుతూ అవసరమైన వారికి అండగా నిలుస్తున్న భైంసా నేతాజీ నగర్ యువకుడు సాయి కుమార్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సోమవారం భైంసా పట్టణంలోని వెంకటేశ్వర హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సయవ్వ అనే మహిళకు అత్యవసరంగా ఓ+ రక్తం అవసరమని తెలిసిన వెంటనే స్పందించి సాయి కుమార్ రక్తదానం చేశారు. స్వార్థం లేకుండా సమాజానికి సేవ చేయాలనే ధృక్పథంతో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. సాయి కుమార్ నిస్వార్థ సేవకు పలువురు అభినందనలు తెలిపారు