భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్

భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 21 :- నిర్మల్ జిల్లా భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్‌ను సెప్టెంబర్ 26, 2024న జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ తనిఖీ చేశారు. ఆమె మొదటగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్‌లోని సిబ్బంది యొక్క డ్రిల్ సమీక్షించి, ప్రతి శనివారం డ్రిల్ పరేడ్‌లో పాల్గొనాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ వాహనాలు, స్టేషన్ రికార్డులను తనిఖీ చేసి, కేసుల దర్యాప్తులో అలసత్వం వహించొద్దని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులకు వెంటనే స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.నారి శక్తి మరియు పోలీస్ అక్క ప్రోగ్రామ్‌లలో పాల్గొంటున్న మహిళా సిబ్బందిని అభినందించిన ఎస్పీ, డయల్ 100 కాల్స్‌కి తక్షణ స్పందన అవసరమని అన్నారు. స్టేషన్ పరిధిలో గంజాయి, అక్రమ ఇసుక, పిడియాస్ రైస్ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కార్యక్రమం ముగింపు సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అవినాష్ కుమార్ ఐపిఎస్, సి.ఐ నైలు, గోపినాథ్, ఎస్.ఐ రవీందర్, భాస్కరా చారి, ప్రొబేషనరీ ఎస్.ఐ సుప్రియ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!! KCR | హైదరాబాద్ : రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ బీఆర్ఎస్‌దే అని పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. రాష్ట్రంలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి…

    తెలంగాణకు గ్రామస్థాయి అధికారులు వస్తున్నారహో…

    తెలంగాణకు గ్రామస్థాయి అధికారులు వస్తున్నారహో… మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 22 – గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్దీస్తా మని, సీఎం రేవంత్ రెడ్డి, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తో పాటు పలువురు నాయకులు ప్రకటించినట్లుగానే మంత్రిమండలి 10,954 గ్రామ పరిపాలన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త పోలీస్‌ బాస్‌ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది.

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త పోలీస్‌ బాస్‌ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది.

    గుండె పోటుతో ఆర్ ఎంపీ వైద్యులు మృతి

    గుండె పోటుతో ఆర్ ఎంపీ వైద్యులు మృతి

    23-03-2025 / ఆదివారం / రాశి ఫలితాలు

    23-03-2025 / ఆదివారం / రాశి ఫలితాలు

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!