

రైతులకు ఇబ్బందులు కలగకుండా దశలవారీగా పానాజీ రోడ్ల నిర్మాణం
భైంసాలో పశువైద్యశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 23 – గత పది సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో పంట పొలాలకు వెళ్లే రహదారుల నిర్మాణానికి అప్పటి పాలకులు నిధులు మంజూరు చేయకపోవడంతో, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. ఆదివారం బైంసా పట్టణంలోని కిసాన్ గల్లీలో 25 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పశు వైద్యశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రైతులు ట్రాక్టర్లు వాడుతున్న తరుణంలో పొలాలకు వెళ్లడానికి పానాజీ రోడ్ల నిర్మాణం అవసరమన్నారు. ఈ విషయంలో బి జె ఎల్ పి శాసనసభాపక్ష ఉపనేత పాయల శంకర్ అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తేవడం జరిగిందని, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. అదేవిధంగా గత శుక్రవారం బిజెపి శాసనసభ్యులం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగిందని, ఉపాధి హామీ పథకం కింద ఈ రోడ్ల నిర్మాణం మహారాష్ట్రలో జరిగిన విధంగా జరగాలని సూచించడం జరిగిందన్నారు. వెంటనే సీఎం అధికారులను ఆదేశించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం హామ్ పథకం కింద పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో రోడ్ల నిర్మాణం చేపట్టడానికి పూనుకుందన్నారు. అదేవిధంగా పశు వైద్యధికారి విఠల్ పనితీరును అభినందించి, శాలువాతో సత్కరించారు. వచ్చే సంవత్సరం ఇక్కడే పది లక్షల రూపాయలతో రైతు శిక్షణా కేంద్రం కోసం భవనాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. కుబీర్,బాసర,కల్లూర్ లో పశువైద్యశాల భవనాల నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు చేస్తానని ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్, స్థానిక నాయకులు గాలి రవి, పలు సమస్యలు తెలియజేయడంతో. బాబుల్ గావ్, కమలాపూర్ వెళ్లే రోడ్డుకు త్వరలో నిధులు మంజూరు చేయించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్ జిల్లా పశు వైద్యాధికారి బాలిక్ హైమద్, డి. ఇ.రాజేందర్, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్,నాయకులు గాలి రవి భైంసా మండల బిజెపి అధ్యక్షురాలు సిరం సుష్మరెడ్డి, స్థానిక నాయకులు తాలోడ్ శ్రీనివాస్,రావుల పోశెట్టి, తుమొల్ల దత్తాత్రి,రవి, కాసరోల్ల ప్రవీణ్, గాలి రాజు, భీమ్ రావ్ డోంగ్రే, తదితరులు పాల్గొన్నారు

