

భూ సమస్యలపై వెల్లువెత్తిన వినతులు
• అర్జీలు స్వీకరించి పరిష్కారానికి కృషి చేసిన నేతలు
• స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి
నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి భూ సమస్యలు, వివిధ సమస్యలపై తరలి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలపై వెను వెంటనే అధికార్లకు ఫోన్లు చేసి అర్జీల పరిష్కారానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్, ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరీ లు కృషి చేశారు. అర్జీలు రిపీట్ అవ్వకుండా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఫోన్ లో సూచించారు.
• నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం వీరారెడ్డి పల్లె గ్రామానికి చెందిన తుమ్మూరు కోటి రెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. తమ భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని అధికారులకు ఎన్ని సార్లు అర్జీలు పెట్టుకున్నా పట్టించుకోవడంలేదని.. దయ చేసి తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించి భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
• చిత్తూరు జిల్లా వి. కోట మండలం రామనాథపురం గ్రామానికి చెందిన పి.కే సరస్వతి విజ్ఞప్తి చేస్తూ.. తాము యానాధులమని తమకు భూమి అమ్ముతానని తమ వద్ద డబ్బులు తీసుకొని మోహన్ రావు అనే వ్యక్తి మోసం చేశాడని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• తమ భూమిని సర్వే చేసి రాళ్లు పాతాలని ఎన్ని సార్లు అధికారులకు అర్జీ పెట్టుకున్నా.. సర్వేయర్లు అసలు పట్టించుకోవడంలేదని.. దయ చేసి అధికారులు పట్టించుకొని తమ భూ సమస్యను పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి గ్రామాకి చెందిన రంగయ్య అనే వ్యక్తి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు.
• అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఇమ్మపాలెం గ్రామానికి చెందిన దుల్ల శంకరరావు విజ్ఞప్తి చేస్తూ చేస్తూ.. గత వంద సంవత్సరాలకు పైగా తాము వారసత్వంగా అనుభవిస్తున్న భూమికి పాస్ పుస్తకాలు ఇచ్చి తమ పేరు మీద ఆన్ లైన్ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
• కర్నూలు జిల్లా సి. బెళగల్ మండలం కొలకల్లు గ్రామానికి చెందిన పి. జమ్మన్న విజ్ఞప్తి చేస్తూ.. తమ గొర్రెలను వైసీపీ పార్టీ వారు దొంగతనం చేస్తున్నారని.. దొంగలను తాము స్వయంగా పోలీసులకు పట్టించినా కేసు పెట్టకుండా వారిని విడిచిపెడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. దొంగలను అరెస్ట్ చేసి తనకు న్యాయం జరిగేలా చూడాలని గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి అభ్యర్థించాడు.
• ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన విద్యాధరరావు విజ్ఞప్తి చేస్తూ.. తనకు గుంటూరు జిల్లా పెదనందిపాడులో 2.16 ఎకరాల భూమి ఉందని.. కాని రెవెన్యూ రికార్డుల్లో తగ్గించి చూపుతున్నారని.. దాన్ని సరిచేయాలని ఎన్ని సార్లు అధికారులకు అర్జీ పెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేశాడు.
• గూంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రాయపాటి రాఘవమ్మ విజ్ఞప్తి చేస్తూ.. మంగళగిరి పరిధిలో తమకు భూమి ఉందని.. వాస్తవంగా ఉన్నభూమి 1.76 ఎకరాల అయితే 1.40 ఎకరాలుగా తగ్గించి చూపుతున్నారని.. జరిగిన తప్పును సరిచేసి తమ వాస్తవ భూమిని ఆన్ లైన్ లో ఎక్కించాలని విజ్ఞప్తి చేశారు.

