

భీమారం వారసంతలో వసతులు కల్పించండి
మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి.
భీమారం మండల కేంద్రంలో ప్రతి ఆదివారం వారసంత జరుగుతుంది. స్థానిక అవడం ఎక్స్ రోడ్ నుంచి అవడం వెళ్లే దారికి ఇరువైపులా విక్రయదారులు తమ విక్రయాలను కొనసాగిస్తారు. భీమారం, పరిసర ప్రాంతాల నుంచి కూరగాయలు, పండ్లు అమ్మేవారు, కొనేవారు వస్తూ ఉంటారు. వారికి మూత్రశాలలు, తాగునీటి వసతి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు సరైన వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు
