

భీమారం లో ఉచిత యోగ ధ్యాన శిబిరం.
మనోరంజని న్యూస్ , మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి.
ప్రపంచవ్యాప్తంగా 162 దేశాలలో శారీరక, మానసిక ఆరోగ్యానికి మరియు ఆంతరంగిక చైతన్యానికి ఉపయోగపడే యోగ ధ్యాన కార్యక్రమాలను ఉచితంగా నిర్వహిస్తున్న శ్రీరామచంద్ర మిషన్ మరియు హార్ట్ ఫుల్ నెస్ సంస్థ భీమారంలో ఈనెల 24వ తేదీ నుండి మూడు రోజులు గీత హై స్కూల్ (గుడ్ మార్నింగ్ స్కూల్) యందు సాయంత్రం 6 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మండలంలో ఉన్న ప్రజలందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలరని సంస్థ ట్రైనర్ పర్శ శ్రీనివాస్ గారు కోరడం జరిగింది.
అలాగే గీత హై స్కూల్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి, యోగ మాస్టర్ పోటు మురళీధర్ రెడ్డి, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు సాయిని లక్ష్మి నారాయణ,శ్రీనివాస్, ఆడెపు వెంకటేశం మాట్లాడుతూ 15 సంవత్సరాలు దాటిన వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ధ్యాన సంస్థ అందిస్తున్న యోగ ధ్యానాన్ని నేర్చుకోవాల్సిందిగా తెలిపారు