

మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజక వర్గ ప్రతినిధి మార్చి 27 :- మంచిర్యాల జిల్లా, భీమారం మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖను బ్యాంకు చైర్మన్ వై.శోభ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భీమారం మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడానికి భీమారం మండల కేంద్రంలో బ్రాంచ్ ను ప్రారంభించామని తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ దండు సతీష్, బ్యాంకు సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.
