

భార్యను హతమార్చి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
AP: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో విషాదం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను హతమార్చిన భర్త అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న సురేశ్ ఆరు నెలల క్రితం రేవేంద్రపాడుకు మకాం మార్చారు. భార్య శ్రావణిపై అనుమానంతో సురేష్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.