

భార్యను చంపి.. సూట్కేసులో పెట్టిన భర్త
బెంగళూరులో ఘోరం చోటుచేసుకుంది,,
మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ అనే వ్యక్తి తన భార్య (32) ను హత్య చేశాడు.
అనంతరం సూట్కేసులో కుక్కి పరారయ్యాడు. తానే చంపానని ఆమె తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్లో చెప్పినట్లు సమాచారం.
వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని గాలించి పుణేలో పట్టుకున్నారు.
తమ మధ్య గొడవల సమయంలో భార్య తరచూ చేయిచేసుకుంటోందన్న కోపంతోనే భర్త ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.