బ్రేక్ ఫాస్ట్‌లో ఇవి తప్పనిసరిగా తీసుకోండి: నిపుణులు
మనోరంజని ప్రతినిది మార్చి ౦2 ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకునే ఆహారంలో పీచు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం రాగులు, జొన్నలు, సజ్జలతో చేసిన బ్రెడ్లు, అటుకులు, ఓట్మీల్ వంటి వాటిని సూచిస్తున్నారు. ఆ తరువాత పెరుగు, ఉడకబెట్టిన గుడ్లు తీసుకుంటే.. వీటి నుంచి మాంసకృత్తులతో పాటు అత్యవసర విటమిన్లు, ఖనిజాలు కూడా అందుతాయని అంటున్నారు. అలాగే తాజా పండ్లు, సోయా పాలు, బాదం.. అక్రోట్.. వంటి డ్రై ఫ్రూట్స్, కూడా తినవచ్చని చెబుతున్నారు