బ్రహ్మోత్సవాల్లో పాల్గొన ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
మనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి ఫిబ్రవరి 28 :చేవెళ్ల శ్రీ లక్ష్మీ దేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తో కలిసి, మాజీ జెడ్పిటిసి బాలరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు .శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆయనం తెలిపారు .భక్తులు భారీగా పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు అని తెలిపారు.