బోల్తా పడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
మనోరంజని ప్రతినిధి మార్చి 10 - ఆంధ్రప్రదేశ్ : ఏలూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సోమవారం ఉదయం బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. మిగిలినవారికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతోంది