

బోధన్ లో మాదిగ అమరుల సంస్మరణ దినోత్సవo
మనోరంజని బోధన్ మండలం మార్చి01
నిజామాబాద్ జిల్లా బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో మాదిగ రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలో మార్చి 1న మాదిగ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదిగ అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్ మాదిగ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఎస్సీలలోని ఉమ్మడి రిజర్వేషన్లను జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమించడం జరిగింది… ఎస్సీ వర్గీకరణ సాధించుకునే క్రమంలో ఉద్యమ పోరాటంలో కొంతమంది ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకుల దాడుల్లో అమరుల అవడం జరిగింది… గత ప్రభుత్వ పాలకుల పై ఒత్తిడి చేసే క్రమంలో గాంధీభవన్ దగ్ధం చేసిన ఘటనలో నలుగురు యువ నాయకులు పొన్నాల సురేందర్ మాదిగ , దామోదర్ మాదిగ,తెల్లపల్లి రవి మాదిగ నాయకత్వంలో అమరులైనారు… కెసిఆర్ ప్రభుత్వం పై ఉద్యమించడం లో భాగంగా భారతి మాదిగ రాజ ఎల్లన్న మాదిగ అమరులైనారు ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ సాధన కోసం వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో వారు మరణిస్తూ ఉద్యమాన్ని బతికిస్తూ నేటి వరకు కొనసాగించడానికి కారకులైన అమరులను స్మరించుకోవడం యావత్ మాదిగ జాతి యొక్క బాధ్యత గత 20 ఏళ్లుగా మార్చి 1న మాదిగ అమరులను స్మరించుకోవడంలో భాగంగా “మాదిగ అమరుల సంస్మరణ” దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది…. గత సంవత్సరం ఆగస్టు 1న కేంద్ర ప్రభుత్వం చొరవతో సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అప్పగించడం ద్వారా మాకు మంచి అవకాశం వచ్చింది మాదిగల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించి పెడుతుందని చెప్పి వర్గీకరణ అమలుకై మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటుచేసి ఎస్సీ వర్గీకరణకై ఏకసభ్య కమిషన్ను నియమించి వాటి నివేదికల ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 7న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది 90% ఎస్సీ వర్గీకరణ సాధించడం జరిగింది మార్చ్ 10 లోపు పూర్తిస్థాయిలో వర్గీకరణను అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతూ అదే సమయంలో మాదిగ అమరుల కుటుంబాలను కూడా ఆదుకోవాలని మాదిగ అమరుల ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ,ఆర్థికంగా ఆదుకోవాలి, వారికి సొంత పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్ మాదిగ బోధన్ నియోజకవర్గం ఇంచార్జ్ కనిగేకర్ గంగాధర్ మాదిగ, మోచి సంఘం నాయకులు సింధి శంకర్, బోధన్ ఎమ్మార్పీఎస్ నాయకులు రెడ్డి వెంకటేష్ మాదిగ, మేతరి సాయికుమార్, అశోక్ మాదిగ, రాకాసిపేట్ సాయి, పులి అభినయ్, శేఖర్, మోహన్ రావు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు