

బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయపడిన ఘటన శనివారం ముధోల్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం బైక్ వస్తున్న ఉరేకర్ పోతన్న (30) నాందేడ్ గల్లిలో బైక్ తో విద్యుత్ స్తంభానికి బలంగా ఢీకొన్నాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు కాగా పెట్రో కార్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజమణి, ఎస్ఐ సంజీవ్ ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108లో భైంసా ఆసుపత్రికి తరలించారు